వైరల్ వీడియో :రైల్వే స్టేషన్ లో అందరి ముందు ముద్దు

Friday, February 23rd, 2018, 09:56:32 AM IST

మహిళల కోసం ప్రభుత్వాలు పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇంకా వారిపై అఘాయిత్యాలు తగ్గడం లేదు. కొందరు మగాళ్లు ఇంకా వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ముంబై లో జరిగిన ఒక ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగానే ఉదయాన్నే ఒక వ్యక్తి అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అసలు వివరాల్లోకి వెళితే.. నవీ ముంబైలోని టర్బే రైల్వే స్టేషన్‌ లో ఇక యువతి రాగా ఆమెను ఫాలో అవుతూ మరొక వ్యక్తి వచ్చాడు. అందరూ చూస్తుండగానే ఆమె దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఘటన మొత్త సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు కే జోషిని పోలీసులు అరెస్ట్ చేశారు.