వైరల్ వీడియో : ప్రాణాలకు తెగించి తమ్ముడిని కాపాడింది!

Thursday, February 15th, 2018, 10:40:23 PM IST

కర్ణాటకలో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి చేసిన సాహసం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తమ్ముడిని కాపాడుకోవడానికి ఆ బాలిక ప్రాణాలకు తెగించి కష్టపడటంతో చాలా మంది ప్రశంసలను అందిస్తున్నారు. ఏ మాత్రం భయపడకుండా దైర్యంగా ఓ ముగ జంతువు దాడిని ఎదుర్కొన్న తీరుకు నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. అసలు వివరాల్లోకి వెలితే.. కర్ణాటక లోని హొన్నవార్ తాలూకు చెందిన నవళగాన్ గ్రామంలో 8 ఏళ్ల బాలిక ఇంటిబయట తన నాలుగేళ్ళ తమ్ముడితో ఆడుకుంటుంది. అయితే ఆనందంగా ఉన్న వారిపై ఒక ఆవు దాడి చేయడానికి ప్రయత్నించింది. బాలుడిపై దాడికి ప్రయత్నించగా ఆ బాలిక ఏ మాత్రం అదైర్య పడకుండా అవును ఎదుర్కొంది. కొమ్ములతో పొడుస్తున్నా సరే తన తమ్ముడిని వదలకుండా పట్టుకుంది. అనంతరం ఆమె తండ్రి వచ్చి అవును బెదరగొట్టాడు. ఘటన మొత్తం సమీపాన ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.