‘ల‌వ్ ఫెయిల్’ అయితే ఎవ‌రు ఎక్కువ బాధ‌ప‌డ‌తారు..?

Sunday, July 17th, 2016, 12:02:17 AM IST


యువ‌తీ యువ‌కులు ప్రేమ‌లో ప‌డితే ఏదో తెలియ‌ని తియ్య‌ని లోకంలో విహ‌రిస్తూ ఉంటారు. నీవు లేక‌ నేను లేను అంటూ ల‌వ్ సాంగ్స్ పాడుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా కార‌ణంతో ఆ ప్రేమ విఫ‌ల‌మైతే ఆ భాద వ‌ర్ణించ‌లేని విధంగా ఉంటుంది. ల‌వ్ ఫెయిలైన కొత్త‌లో తిండీ, నిద్ర స‌హించ‌ని విధంగా త‌యారవుతారు. ఒక అమ్మాయి. అబ్బాయి ల‌వ్ ఫెయిల్ అయిన‌ప్పుడు ఎవ‌రు ఎక్కువ బాధ‌ప‌డతారు అన్న‌ది కొంచెం ఆస‌క్తిగానే ఉంటుంది. ల‌వ్ ఫెయిల్ అయితే అమ్మాయిలు ఈజీగా మ‌ర్చిపోతార‌ని మేమే ఎక్కువ బాధ‌ప‌డ‌తామ‌ని అబ్బాయిలు చెపుతూ ఉంటారు. అమ్మాయిలు మాత్రం అదేం కాదు అని అంటూ ఉంటారు.

అస‌లు ఇంత‌కీ ప్రేమ విఫ‌ల‌మైతే అమ్మాయి, అబ్బాయిల్లో ఎవ‌రు ఎక్క‌వ బాధ‌ప‌డ‌తారు అన్న చిక్కు ప్ర‌శ్న‌కు ఆన్సర్ చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. ఇలాంటి చిక్కు ప్ర‌శ్న‌పై ఆన్స‌ర్ క‌నుగొనే ప్ర‌యత్నం చేసారు బింగ్ హంట‌న్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు. వారి ప‌రిశోధ‌న‌ల్లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ల‌వ్ ఫెయిల్ అయిన సంద‌ర్భాల్లో అమ్మాయిలే ఎక్కువ‌గా బాధ‌ప‌డతార‌ని వీరు తేల్చారు. ఇటువంటి సంద‌ర్భం ఎదురైన‌ప్పుడు అమ్మాయిలు శారీకంగా, మాన‌సికంగా చాలా ఇబ్బందులు ప‌డ‌తార‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. ఇండియా స‌హా 96 దేశాల్లో ప‌రిశోధ‌న చేసి ఈ విష‌యం క‌నిపెట్టారు. సున్నిత మ‌న‌స్త‌త్వం క‌లిగిన అమ్మాయిల్లో అయితే ల‌వ్ ఫెయిల్ బాధ రెట్టింపు ఉంటుంద‌ని ఆ రీసెర్చ్ లో తేలింది.