హైదరాబాద్ లో రెంట్ కి ఉండే అమ్మాయిల పరిస్థితి అంతేనా!

Tuesday, May 1st, 2018, 12:42:39 AM IST

ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలో నివాసం కోసం చూస్తున్న అమ్మాయిలకు, మహిళలకు ఇల్లు దొరకడం కష్టంగా ఉందని ఇటీవల ‘నెస్ట్ అవే’ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వే లో తేలినట్లు తెలుస్తోంది. నిజానికి హైదరాబాద్ లో మహిళల రక్షణకు పోలీస్ లు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ హౌస్ ఓనర్ లు మాత్రం మహిళలకు ఇల్లు ఇవ్వడానికి జంకుతున్నారు. అందునా మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాలనుండి ఒంటరిగా ఉద్యోగం నిమిత్తం వస్తున్న ఒంటరి మహిళలకైతే అస్సులు ఇల్లు ఇవ్వనంటున్నారట. సరే అని నానా తంటాలు పడి ఇల్లు దొరికితే, అత్యధిక రెంట్ లు వసూలు చేస్తున్నారట.

మా జీతాల్లో చాలా వరకు అద్దెలకు పోతున్నాయని పలువురు మహిళలు, అమ్మాయిలు వాపోతున్నారట. మరి కొందరు అయితే ఇల్లు అద్దెకు ఉన్నప్పటికీ కుంటి సాకులు చెప్పి ఇవ్వకుండా తప్పించుకుంటూ వేరే చోట ఖాళి ఉంటే వెతుక్కోండని ఉచిత సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి వేర్వేరు నగరాల్లోని, వేర్వేరు ప్రాంతాల్లోగల ఉద్యోగం చేస్తున్న మహిళల అభిప్రాయాలు సేకరించి ఈ వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని మాదాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్, బంజారాహిల్స్, జూబిలీ హిల్స్ వంటి ప్రాంతాల్లోని మహిళల నుండి ఈ సర్వే నిర్వహించారు. కాగా మహిళా భద్రత విషయంలో జరిగిన సర్వే ప్రకారం హైదరాబాద్ తరువాత పూణే, బెంగుళూరు లు ఉన్నట్లు తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments