షాక్ : దుర్గమ్మకు కండ్లనే కానుకగా ఇచ్చిన యువతి

Sunday, March 25th, 2018, 06:40:39 PM IST

దుర్గామాత అంటే ఎంత పవర్‌ఫుల్ అమ్మవారో సాధారణంగా అందరికీ తెలుసు. భక్తులు దుర్గామాతకు చీరెలు, గాజులు, కుంకుమభరిణె కానుకగా సమర్పిస్తారు. కాని.. ఓ 16 ఏండ్ల అమ్మాయి మాత్రం ఏకంగా తన కండ్లనే దుర్గామాతకు కానుకగా సమర్పించింది. వినడానికి ఆశ్చర్యంగా, వింతగా, కొత్తగా, భయంకరంగా అనిపించినప్పటికీ ఇది అక్షరాలా నిజం. వివరాల్లోకి వెళ్తే…

అది బీహార్ రాజధాని పాట్నాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్భంగా జిల్లా బహేరిలోని సిరువా గ్రామం. అక్కడ ఉన్న దుర్గామాత టెంపుల్‌కు ఓ ఫ్యామిలీ దర్శన నిమిత్తం వెళ్లింది. ఆ టెంపుల్‌లో దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి. చైత్ర నవరాత్ర ఉత్సావాల్లో ఏడో రోజును అక్కడ ఘనంగా జరుపుతున్నారు. టెంపుల్‌లో చుట్టూ జనాలు… దుర్గామాత దర్శనం కోసం పోటెత్తారు. ఆ ఫ్యామిలీ కూడా అందరిలాగే దుర్గామాతను దర్శించుకుంటున్నది. ఆ ఫ్యామిలీకే చెందిన ఓ అమ్మాయి అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడుతూ.. దుర్గామాతకు కండ్లను సమర్పించవచ్చా అని అడిగింది. అలా అడిగిన మరు క్షణంలోనే తన చేతి వేళ్లతోనే తన రెండు కండ్లను పీకింది. ఈ ఘటనను గమనించిన భక్తులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ అమ్మాయిని బహేరి ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. తర్వాత దర్భంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

“సంప్రదాయం ప్రకారం.. ఉత్సవాల్లోని ఏడో రోజున దుర్గామాతకు గోల్డెన్ యాపిల్ బేర్ విత్తనాలతో చేసిన కండ్లను కానుకగా సమర్పిస్తుంటారు. కాని.. తమ కండ్లను ఎవరూ అలా అర్పించరు. ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతుండవచ్చు..” అని దుర్గామాత టెంపుల్ పూజారి భావ్‌నాత్ ఝా వెల్లడించారు.

“తన చేతి వేళ్లతోనే తన రెండు కండ్లను బయటికి లాగడం వల్ల తన చేతి వేళ్లు బలంగా కండ్లకు తాకి కంటి గుడ్లు బాగా దెబ్బతిన్నాయి. మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. తనకు కంటి చూపు మళ్లీ వస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే.. ఆ అమ్మాయి ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కావట్లేదు.. ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్‌తోనూ మాట్లాడాను. తను ఎటువంటి మానసిక సమస్యలతో బాధపడట్లేదు. నార్మల్ అమ్మాయే.. ఎందుకు ఇలా చేసిందో తమకూ అర్థం కావట్లేదంటూ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పినట్లు తనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్ తెలిపాడు. ఆమె కాస్త కొల్కున్నాక డాక్టర్లు ఆమెను మానసిక వైద్యుడి దగ్గరకి తరలించి చికిత్ర్స చేయిస్తాం అన్నారు.