హ‌రికృష్ణ తీరుగ‌.. బాల‌య్య చుట్టం!

Wednesday, October 3rd, 2018, 10:00:18 AM IST

అమెరికాలో ఘోర‌మైన యాక్సిడెంట్ ఇది. మొన్న‌నే హ‌రికృష్ణ సినిమాటిక్ యాక్సిడెంట్‌ని మ‌ర్చిపోక ముందే అంత‌కుమించిన సినిమాటిక్ యాక్సిడెంట్ ఇది. ఈ యాక్సిడెంట్‌లో మ‌ర‌ణించిన వ్య‌క్తి న‌ట‌సింహా, నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ద‌గ్గ‌ర చుట్టం. త‌న వియ్యంకుడి తండ్రిగారు, వైజాగ్‌- గీతం యూనివ‌ర్శిటీ వ్య‌వ‌స్థాప‌క అధినేత, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి అని తెలుస్తోంది.

అమెరికాలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఈ టెర్రిబుల్ యాక్సిడెంట్ జ‌రిగింది. ఎమ్మెల్సీ మూర్తి స‌హా, మ‌రో ముగ్గురు స్పాట్ డెడ్ అని తెలుస్తోంది. అయితే ఆ కార్‌లో ఒకే ఒక్క‌రు మాత్రం మ‌ర‌ణ‌గండం గ‌ట్టెక్కి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. చ‌నిపోయిన వారిలో వెలివోలు బ‌స‌వ పున్న‌య్య‌, వీర‌మాచినేని శివ‌రామకృష్ణ‌, వీబీఆర్ చౌద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. క‌డియాల వెంక‌ట‌ర‌త్నం మాత్రం గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వీళ్లంతా ఇండ‌స్ట్రియ‌లిస్టులు.. బిగ్ షాట్స్. అమెరికా కార్‌లో ప్ర‌యాణిస్తూ ఆక‌స్మిక‌ ప్ర‌మాదానికి గుర‌య్యారు. అస‌లు ఈ యాక్సిడెంట్‌కి కార‌ణ‌మేంటి? అంటే ఓ భారీ ట్ర‌క్ పార్క్ హైవేలో వీళ్లు వెళుతున్న బీఎండ‌బ్ల్యూ కార్‌ని గుద్దేసింది. 185 మైళ్ల వేగంగా ఎదురుగా వ‌స్తున్న ట్ర‌క్ వీరు వెళుతున్న కార్‌ని గుద్దేసిందిట‌. శ‌వాలు గుర్తించ‌లేని తీరుగా చితికిపోయాయ‌ని తెలుస్తోంది.