నా రూ.150కోట్లు నాకు ఇవ్వండి…కేసు వేసిన ధోనీ

Thursday, April 12th, 2018, 06:24:41 PM IST

ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ సంస్థ మీద కేసు వేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. విషయం లోకి వెళితే, మన దేశంలోని పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్ ల్లో ఒకటైన ఆమ్రపాలి గ్రూప్ ప్రస్తుతం ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే గతంలో ఈ సంస్థ ధోని తో చేసుకున్న ఒప్పందం ప్రకారం తనకు రావలసిన బతికే రూ.150కోట్లు చెల్లించాలని ఆయన కోర్టులో వ్యాజ్యం వేశారు. అయితే ధోని ఈ సంస్థకు ఆరు నుండి ఏడు సంవత్సరాలు రాయబారిగా వ్యవహరించారు.

కాగా ఏప్రిల్ 2016 లో ఆయన ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం సంస్థ ధోనికి ఆ మొత్తం నగదు చెల్లించవలసి వుంది. అయితే ఆ సంవత్సరం భారత క్రికెట్ జట్టు లోని ఆటగాళ్లందరికి ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థ రూ.9కోట్లు విలువైన విల్లాలని బహుమతిగా ఇచ్చింది. అందులో ఒక్క ధోనికి మాత్రం రూ.1 కోటి విలువచేసే విల్లా, అలానే మిగతా ఆటగాళ్లకు రూ.50 లక్షలు విలువ చేసే అపార్ట్మెంట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ధోని వేసిన ఈ కేసుపై కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది……