పక్కలో బళ్లెం..మోడీని తెగ పొగిడేస్తోంది..!

Tuesday, November 15th, 2016, 11:06:42 AM IST

venkaiya
ప్రస్తుతం అభివృద్ధిలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ దూసుకుని పోతోంది చైనా. చైనా తో పోటీ పడేలా భారత్ అభివృద్ధి వైపు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా దేశాలమధ్య నెలకొన్న వాణిజ్య పోటీ నేపథ్యంలో భారతదేశమే తనకు ప్రధాన పోటీ అని చైనా భావిస్తోంది.ఈ నేపథ్యం లోనే చైనా పాక్ కు సహకరిస్తోందన్న విషయం బహిరంగ రహస్యం. ఇటీవల ఎన్ ఎస్ జి విషయం లో కూడా చైనా భారత్ కు సహకరించలేదు. ప్రధాని అయిన తరువాత మోడీ మెరుపు నిర్ణయాలు చైనా తో అభివృద్ధి లో భారత్ మరింత పోటీ పడేలా చేస్తున్నాయన్నది వాస్తవం.

ఇటీవల పెద్దనోట్లను రద్దు చేస్తూ మోడీ సంచలనం తీసుకున్న నిర్ణయాన్ని చైనా మీడియా ప్రశంసలతో ముంచెత్తుతోంది.ఇది నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన చర్యగా చైనా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్ ‘ అభివర్ణించంది. అయినా భారత్ లో అవినీతి అంతానికి ఈ ఒక్క నిర్ణయం సరిపోదని ఆ సంస్థ పేర్కొంది. అధికారం లోకి వచ్చినప్పటి నుంచి అవినీతి అంతానికి, పామును ఎగవేత దారులపై చర్యలకు మోడీ తీసుకున్న నిర్ణయాలను సంస్థ కొనియాడింది. ప్రదాని మోడీ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పార్లమెంట్ హౌస్ వద్ద మీడియాకు చూపించారు.