జాగ్రత్త మోడీ.. చైనా మీడియా సీరియస్ వార్నింగ్..?

Friday, November 18th, 2016, 09:53:49 PM IST

modi1
చైనా భారత్ ని నిశితంగా అనుక్షణం గమనిస్తుందనడానికి ఇదే నిదర్శనం. తన డ్రాగన్ కళ్ళతో చైనా భారత్ పై ఓ కన్ను వేసి ఉంచింది.భారత్ లో జరుగుతున్నా ప్రతి పరిణామాన్ని చైనా నిశితంగా గమనిస్తోంది.కొన్ని రోజుల క్రితం మోడీ పెద్ద నోట్ల రద్దుతో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారని, ఇది భారత్ అభివృద్ధిలో దూసుకుపోవడానికి ఉపయోగపడుతుందని ప్రశంసిస్తూ చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

కాగా మోడీ ని హెచ్చరిస్తూ మరో కథనాన్ని వెలువరించింది. మోడీ తెలివిగా వ్యవహరించకపోతే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అతి పెద్ద పొలిటికల్ జోక్ గా మిగిలిపోయో అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా పెద్ద సాహసమే. దీనిని మోడీ సుఖాంతం చేయాలనుకుంటే వివేకం తో వ్యవహరించాలని సూచించింది. మోడీ ఎన్నికల్లో నల్లధనాన్ని బయటకు తీస్తా అని ఇచ్చిన హామీకి అనుగుణంగా అడుగులు వేయాలని లేకుంటే మోడీ రాజకీయం గా నవ్వుల పాలు అయ్యో అవకాశం ఉందని సూచించింది.