గోదావరిలో దారుణం.. లాంచీ బోల్తా!

Wednesday, May 16th, 2018, 09:25:47 AM IST

పశ్చిమ గోదావరిలో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది. లాంచీ బోల్తా పడటంలో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇటీవల జరిగిన ఘటనలు మరవకముందే మరో సారి బోటు ప్రమాదం జరగడం అందరిని కలచివేసింది. పదుల సంఖ్యలో జలసమాధి అయినట్లు తెలుస్తోంది.
కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా దేవీపట్నం సమీపంలో లాంచీ ఒక్కసారిగా తిరగబడి నదిలో మునిగిపోయిట్లు సమాచారం అందింది.

అయితే ఆ లాంచీలో ఎంత మంది ఉన్నారు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కొండల మధ్య ఉహిచని విధంగా ఈదురు గాలులకు లాంచీ మునిగి ఉండవచ్చని తెలుస్తోంది. దాదాపు 40 మంది వరకు అందులో ప్రయాణించగా 30 మంది గల్లంతయినట్లు చెబుతున్నారు. లాంచీ పైన కూర్చున్న కొంత మందికి టెంట్ వేయగా గాలికి టెంట్ కదలడంతో లాంచీ మునగవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అంతే కాకుండా భారీ వర్షానికి అందులో ఉన్న సిమెంట్ బస్తాలు తడిసిపోతున్నాయని నిర్వాహకులు తలుపులు మూసేయడం వలన కూడా ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. పడవ మునిగినపుడు కొందరు లోపలే ఉండటం వలన చనిపోయి ఉంటారని సమాచారం అందుతోంది. ఇక గల్లంతయిన వారికోసం ప్రస్తుతం అధికారులు గజ ఈతగాళ్లతో వెతుకులాట కొనసాగిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments