లిప్‌స్టిక్ బాబా.. తేడా బాబా.. అబ్బాయిలకు మాత్రమే..!

Thursday, March 29th, 2018, 06:13:29 PM IST

లిప్‌స్టిక్ బాబా ఇంతా అనుకుంటున్నారా..? ఒక్కసారు గతంలోకి వెళ్దాం రండి. ఓ ఆరు నెలల కింద అప్పట్లో సంచలనం సృష్టించిన డేరా సచ్చ సౌదా ఫౌండర్ గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్ అలియాస్ డేరా బాబా రాసలీలల గురించి చదివి, విని ఉన్నాం కదా . అయితే అయన ఆశ్రమంలో ఉన్న మహిళలను బెదిరించి వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్న కథలు గుండెలు బద్దలయ్యేలా కోకొల్లలుగా విన్నాం. అయితే.. దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ఇప్పుడు మనం చదవబోయే బాబా తేడా చరిత్ర. అయ్యయ్యో.. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు.. ఆల్ టైమ్ రికార్డ్ అంటాడేమో ఆ బాబా. మరీ.. అంత వరస్ట్‌గా ఉంటుందా ఆ బాబా స్టోరీ అంటే.. నేనేం చెప్పను.. మీరే చదవండి… అంటా తెల్సుకోవచ్చు.

అబ్బాయిలతోనే శృంగారం…

ఇక కథలోకి వెళ్తే ఆయన అసలు పేరు కుల్‌దీప్ సింగ్ ఝాలా. ఊరు రాజస్థాన్. ముద్దు పేర్లు ముద్దు ముద్దుగా బోలెడు పెర్లున్నాయ్. ఎక్కువగా పిలిచేది మాత్రం లిప్‌స్టిక్ బాబా అని. వామ్మో.. అదేం పేరురా బాబు అని అలా పగలబడి నవ్వకండి. దానికి ఓ కారణం ఉంది. ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. మనలాంటి కోవకి చెందిన వ్యక్తి అస్సలే కాదు. సాక్షాత్తూ దైవ సంభూతులు. అని ఆయనే చెప్పుకునే ఒక తేడా బాబా. శక్తి, జగదాంబ పునర్జన్మనని చెప్పుకుంటాడు. అంతే కాదు.. దేవీ నవరాత్రుల సమయంలో అచ్చం మహిళలాగా తయారై.. పెదాలకు లిప్‌స్టిక్ రాసుకుంటాడు. అందుకే ఆ బాబాకు లిప్‌స్టిక్ బాబా అని ముద్దుపేరు పెట్టారు. జగదాంబా బాబా అని పిలిచినా అక్కడ తెలియని వారుండరు. ఆయనకు ఓ 700 మంది దాకా రెగ్యులర్ గా ఫాలోవర్స్ ఉంటారట. అదంతా సరే గాని.. అసలు ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నామనే అనుమానమేగా మీకు వచ్చేది. అక్కడికే వస్తున్నా.

ఈ బాబా తన ఆశ్రమంలో హరే రామ.. హరే కృష్ణ నామస్మరణ చేస్తూ కుర్చుంటే ఇప్పుడు మనం ఆయన గురించి మాట్లాడుకునే వాళ్లమే కాదు. ఎందుకంటే.. ఆయన కూడా సేమ్ టూ సేమ్ డేరా బాబా లాగానే రాసలీలలు చేస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. రాసలీలలంటే మహిళలతో అని అనుకునేరు. సేమ్ టూ సేమ్ డేరా బాబా లాగానే కాని.. మహిళలతో కాదు.. యువకులతో, పురుషులతో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ బాబాకంటే తేడా రోగం ఉండటం వల్ల శృంగారం చేయడానికి పురుషులను ఎంచుకున్నాడు. మరి మగాళ్ళకు ఏం మాయ రోగం దొరక్క దొరక్క ఈయనే దొరికాడా లేక ఈయన పెదాలకు రాస్కున్న లిప్‌స్టిక్ బాగా నచ్చిందా. అసలు సంగతేంటంటే తన పురుష ఫాలోవర్స్‌తో శృంగారం చేసిన అనంతరం వాళ్లను టార్చర్ పెట్టడం.. ఆత్మహత్యకు పురిగొల్పడం ఇవన్నీ లిప్‌స్టిక్ బాబా అసలు రూపం. తనకు పాలోవర్‌గా ఉన్న ఓ 20 ఏండ్ల యువకుడిని ఇలాగే ప్రలోభ పెట్టి.. అత్యాచారం చేసి అతడిని టార్చర్ పెట్టి.. ఆత్మహత్యకు పురిగొల్పినట్టు ఆరోపణలు రావడంతో ఝాలావర్ పోలీసులు లిప్‌స్టిక్ బాబాను అరెస్ట్ చేశారు. దీంతో ఆ బాబా అసలు బాగోతమంతా బట్ట బయలైంది.

ఆవలిస్తే పేగులు తీసారు…

యువరాజ్ సింగ్ అనే కుర్రాడు లిప్‌స్టిక్ బాబాతో శృంగారంలో పాల్గొని తర్వాత ఫిబ్రవరిలో సూసైడ్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ ఓ అమ్మాయితో స్నేహంగా ఉంటున్నాడంటూ టార్చర్ పెట్టడంతోనే సూసైడ్ చేసుకొని చనిపోయాడని సింగ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ నిజానికి ఈ యువకుడు బాబాకు శృంగారంలో సహాయం చేసి మళ్ళీ బాబా చెప్పిన మాట వినకపోయే సరికి బాబా యువరాజ్ ను వేధించడం మొదలు పెట్టాడు. బాబా బాగోతాలన్నీ పోలీసులకు తెలిసిపోవడంతో లిప్‌స్టిక్ బాబా భారిన పడిన మరో ఏడుగురు ఫాలోవర్లు అతడి బాగోతాలను పోలీసులకు వివరించారు. తమను శృంగారంలో పాల్గొనాలని లిప్‌స్టిక్ బాబా ఒత్తిడి తెచ్చేవాడని, శృంగారం తర్వాత టార్చర్ పెట్టేవాడని బాధితులు పోలీసుల ముందు వాపోయారు.