బంగారం ధరలు భగ భగ….

Friday, May 25th, 2018, 06:00:16 PM IST

బంగారం ధరలు రోజురోజుకూ ఉష్ణోగ్రతలకంటే దారుణంగా పెరిగి పోతున్నాయి… అయితే ఈ మధ్యనే బులియన్ మార్కెట్ లో బంగారం మరో రూ.350 పెరిగిన విషయం తెలిసిందే. దీంతో 10 గ్రాముల బంగారం విలువ ఒక్కసారిగా రూ.32,475 లకు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారం దుకాణదారుల నుంచి డిమాండ్‌, షేర్ మార్కెట్స్ పతనం వంటివి బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. కాగా ఇలా బంగారం ధర పెరగడం ఈ వారంలో ఇది నాలుగవ సారి…… దీంతో ఒక సామాన్య, మధ్య తరగతి ప్రజలు పది గ్రాముల బంగారం కొనాలంటే అల్లాడిపోతున్నారు… అయితే ఇది ఇలా ఉంటె, మరోపక్క వెండి ధరలు కూడా వరుసగా పెరుగుతున్నాయి. మార్కెట్ లో కిలో వెండి ధర రూ.250 పెరిగి రూ.41,550 వద్దకు చేరింది. ఇలాగే రోజురోజుకు బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతే భవిష్యత్తులో బంగారం దూరం నుండి చూసి మురిసిపోవడానికే తప్ప కొనలేమని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments