“గోల్ మాల్” కామెడీ సీరియల్: మార్చ్ 11నుండి ఇక నవ్వులే నవ్వులు..!

Monday, February 11th, 2019, 11:40:07 AM IST

ఈటీవీ ప్లస్ లో గోల్ మాల్ అనే మరో కామెడీ సీరియల్ ప్రారంభం కానుంది, వాసు ఇంటూరి, జబర్దస్త్ ఫేమ్ సన్నీ, రాకెట్ రాఘవ తదితరులు ప్రధాన పత్రాలు పోషించిన ఈ సీరియల్ మర్చి 11నుండి ప్రారంభం కానుంది. ఈటీవీ ప్లస్ లో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 9గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సీరియల్ ప్రోమో వింటేజ్ కామెడీ తరహాలో రాజేంద్రప్రసాద్ సినిమాలను గుర్తు చేసే విధంగా ఉంది. మాములుగా సీరియల్స్ అంటే కుటుంబ కలహాలు,అత్తాకోడళ్ల రుసరుసలు లాంటి రొటీన్ కథాకథనాలతో విసిగిపోయిన ఆడియెన్స్ కు ఈ కామెడీ సీరియల్ ఊరటనిచ్చే విధంగా ఉంది. మరీ, త్వరలో రాబోతున్న ఈ కామెడీ సీరియల్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.