కాంగ్రెస్ కు అవకాశం దొరికింది.. సక్సెస్ అయితే బిజెపికి కష్టకాలమే!

Thursday, May 31st, 2018, 06:14:04 PM IST

ఉప ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు బీజేపీ వ్యతిరేకులకు మహానందం కలుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అయితే ఎగిరి గత్తెయ్యడం ఒక్కటే తక్కువ. కొన్ని రాష్ట్రాల్లో మిగిలిపోయిన శాసన సభ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి బీజేపీకి దాదాపు అన్ని స్థానాల్లో దెబ్బ పడింది. గెలుపు తథ్యం అనుకున్న స్థానాల్లో కూడా ఎదురుదెబ్బ తగలడం ఆ పార్టీ అధిష్ఠానానికి మింగుడు పడటం లేదు. అయితే ఇప్పుడు మిత్ర పక్షాలు మెల్లగా బీజేపీతో స్నేహం వదులుకోవడమే మంచిదని అనుకుంటున్నాయి.

బలం లేని చాలా రాష్ట్రాల్లో భారత జనతా పార్టీ స్థానిక పార్టీలను మద్దతు కూడగట్టుకొని అధికారాన్ని అందుకుంది. అయితే భారత జనతా పార్టీ పాలనపై వ్యతిరేకత వస్తుండడంతో చాలా వరకు కొన్ని స్థానిక పార్టీలు దూరమయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీలాంటిని కాంగ్రెస్ ఏకం చేస్తోందనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కి కూడా ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో పోటీని ఇస్తున్నా కూడా అదిఆకారాన్ని అందుకోవడంలో విఫలమవుతోంది. అందుకే ఈ సారి సరైన పద్దతిలో బీజేపీ వ్యతిరేకులను ఏకం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ కి పోటీని ఇవ్వగల సమర్ధవంతమైన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. కానీ రాహుల్ వ్యూహాలు ఎక్కువగా ఫలించడం లేదు. అందుకే సీనియర్ నేతలు ఈ మధ్య ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. వచ్చే 2019 ఎన్నికలకు పూర్తీ ప్రణాళికతో బిజెపిని దెబ్బకొట్టేందుకు కృషి చేయాలనీ కాంగ్రెస్ ఇక నుంచి కూటములు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమైంది. మరి బీజేపీ వారి మద్దతు దారులను ఎంతవరకు కాపాడుకుంటుందో చూడాలి.