తాగిపడిపోయిన వారికి అంబులెన్స్ సేవలు.. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళతారట!

Friday, September 14th, 2018, 12:12:35 PM IST

బార్ కి వెళ్లి ఫుల్లుగా తాగేస్తే మందు బాబులు ప్రపంచాన్ని మరచిపోతారు. ఏ మాత్రం భయం లేకుండా అతి నమ్మకంతో వాహనాలను నడుపుతుంటారు. మరికొందరైతే వైన్స్ ముందే పడుకుంటారు. ఇక మద్యం సేవించి బైకులు నడిపితే పోలీసులు వదలరు. మద్యం ప్రేమికులు ఇన్ని కష్టాలు అనుభవించకూడదు అనుకున్నాడో లేక వారు ఇంటికి క్షేమంగా వెళ్లాలి అనుకున్నాడో తెలియదు గాని ఒక వ్యక్తి మాత్రం వారి కోసం అంబులెన్స్ సేవలని స్టార్ట్ చేశాడు.

అందుకు సంబందించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెదక్ జిల్లా జంగమరాయి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఆవుల గోపాలరెడ్డి సరికొత్త ఆలోచనతో సిద్దమయ్యాడు. తాగి రోడ్డుపై పడిన తరువాత ఇంటికి క్షేమంగా తీసుకెళ్లేందుకు ఉచిత అంబులెన్స్ ని రెడీ చేశారు. చిన్న శంకరంపేటలో మొదట ఈ సేవలను పూజలతో ప్రారంభించారు. ఎక్కడైనా సరే మందు తాగడం అయిపోగానే నడవలేని పరిస్థితుల్లో ఉంటే 9848867779 నంబరుకు ఒక ఫోన్ కాల్ కొడితే చాలు నిమిషాల్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న మందు బాబుల దగ్గరకి వ్యాన్ వాలిపోతుంది. వారిని క్షేమంగా ఇంటికి తీసుకువెళతారు. అయితే మద్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ సేవలను ప్రారంభించలేదని గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మద్యం అలవాటు లేని గోపాల్ రెడ్డి తెలంగాణ తాగుబోతుల సంఘాన్ని’ కూడా ఏర్పాటు చేయడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments