విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చార్జీల మోతకు చెక్!

Wednesday, May 23rd, 2018, 02:15:50 AM IST

కాలం పరిగెడుతున్న కొద్దీ మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలంతో పరిగెత్తేందుకు వేగమైన ప్రయాణాన్ని విమానాల ద్వారా కొనసాగిస్తున్నాం. అయితే అలాంటి ప్రయాణాల్లో ఎన్నో మార్పులు రావాలని గత కొన్నేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా విమాన ప్రయాణికులకు విమానయాన శాఖ కొన్ని శుభవార్తలను తెలిపింది. ముఖ్యంగా చార్జీల విషయంలో విమాన సంస్థలకు చెక్ పెట్టింది.

విడుదల చేసిన కొత్త ప్రతిపాదనల ముసాయిదాలో కెనెక్టింగ్ విమానాలు మిస్ అయితే మూల్యం వంటి విషయాల్లో మార్పులు చేశారు. అలాగే వైఫై సదుపాయం కూడా కల్పించనున్నారు. మరో రెండు నెలల్లో ఈ సేవలు అమలుకానున్నాయి.

రద్దు చార్జీలు ఇక నుంచి ఎక్కువగా ఉండవు. చార్జీల వివరాలను ప్రింట్ చేసి ఇవ్వాలి ఉంటుంది.
కనెక్టింగ్ విమానాలు రద్దయితే యాజమాన్యం 5 వేల వరకు పరిహారం అందించాలి.

అలాగే 12 గంటలకి పైగా ఆలస్యం అయ్యే విమానాన్ని అందుకోకుంటే ప్రయాణికుడికి 20 వేల వరకు మూల్యం చెలించాల్సి ఉంటుంది.

ఇక సాధారణ విమానం నాలుగు గంటలకు పైగా ఆలస్యం అయినా రద్దయినా డబ్బులు మొత్తం వెనక్కి ఇవ్వడానికి సంస్థ సిద్ధంగా ఉండాలి.

ఇక రద్దయిన విమానం స్థానాల్లో మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు మద్దతుగా నిలవాలి.

టికెట్ బుక్ చేసుకున్నాక 24 గంటల లోపు క్యాన్సిల్ చేసుకుంటే ఎటువంటి చార్జీలు వేయకూడదు. అయితే ఇది కేవలం విమానం బయలుదేరడానికి 96 గంటల సమయం ఉన్నవారికే వర్తిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments