తెలంగాణ ఉద్యోగులకు స్వీట్ న్యూస్..!

Wednesday, May 9th, 2018, 10:06:05 AM IST

తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ మారోసారి మంచి వార్తతో ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషాన్ని ఇవ్వనున్నారు. ఈ నెల 14న జరగబోయే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో కేసీఆర్ కొన్ని ప్రకటనలు విడుదల చేయనున్నారు. అదే రోజున వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పదవీ విరమణ వయసు పెంపు, బదిలీలు, పీఆర్సీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) సహా మరికొన్ని అబ్యర్ధనలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి మొత్తం 18 డిమాండ్లపై ఒక నిర్ణయానికి రానున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన 36 డిమాండ్లపై కూడా కేసీఆర్ అధికారులతో చర్చలు జరపనున్నారు. మధ్యాహ్న సమయంలో చర్చలు జరిపిన తరువాత వీలైనంత త్వరగా సానుకూల అంశాలను తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments