పీఎఫ్‌ ఆశావాధులకు గుడ్ న్యూస్!

Monday, July 23rd, 2018, 10:24:20 PM IST

మధ్య తరగతి ఉద్యోగి ఎంతగానో ఆశపడే పీఎఫ్‌ విత్‌డ్రా పై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 26న జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో కొత్త తరహా ప్రతిపాదనను పరిశీలించినట్లు కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ నేడు లోక్‌సభకు తెలిపారు. ఉద్యోగం మానేసినా లేక కోల్పోయినా కూడా ఒక నెల వ్యవధి అనంతరం సదరు ఉద్యోగి ఎకౌంట్ లో 75శాతం వరకు పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకొనవచ్చని తెలిపారు.

మహిళా ఉద్యోగినిలకైతే బంపర్ ఆఫర్ ప్రకటించారు. మహిళలు ఉద్యోగం మానేసే క్రమంలో వెంటనే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నట్లు సంతోష్‌ గాంగ్వర్‌ తెలుపడంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగం నుంచి బయటకు వస్తే ఒక నెల తరువాత వరకు ఖాళీగా ఉంటే పిఎఫ్ డబ్బును 75% వరకు తీసుకొనవచ్చని తెలుపుతూ.. ఇక ఒక కొలువు నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి దాని తాలూకు పిఎఫ్ డబ్బును మొత్తం రెండు నెలల అనంతరం విత్ డ్రా చేసుకోవచ్చని వివరించారు. ఇక జూన్ 30 నాటికి ఈపీఎఫ్‌వో సంస్థ ఈక్విటీ మార్కెట్లో రూ.48,946 కోట్లను పెట్టుబడి పెట్టింది.

  •  
  •  
  •  
  •  

Comments