ఎస్ బిఐ కస్టమర్లకు శుభవార్త !

Tuesday, March 13th, 2018, 03:58:04 PM IST

భారతీయ అతి పెద్ద ప్రతువా రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా పై గత కొద్దీ కాలంగా కస్టమర్లు సుముఖంగా లేరని చెప్పాలి. దానికి ప్రధాన కారణం వున్నట్లుండి ఖాతాల్లో మినిమం బాలన్స్ ఉంచని వారికి భారీ స్థాయిలో చార్జీలు విధించడమే. అయితే కొన్నాళ్ల క్రితం ఆ చార్జీల్లో కొంత మేర తగ్గింపు ఇచ్చిన ఆ బ్యాంకు నేడు ఖాతాదారులకు ఒక తీపి కబురు చెప్పింది. సగటు నెల వారీ మొత్తాలను నిర్వహించని సేవింగ్స్‌ అకౌంట్లపై విధిస్తున్న ఛార్జీలను భారీగా తగ్గించింది . ఈ ఛార్జీల తగ్గింపు 2018 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందనున్నట్టు తెలుస్తోంది.

అయితే అంతకముందు మెట్రో, అర్బన్‌ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న ఛార్జీ 50 రూపాయలు, (జీఎస్టీ కలుపుకుని) నుంచి 15 రూపాయల(జీఎస్టీ కలుపుకుని)కు తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటన విడుదల చేసింది. అలానే మెట్రో, అర్బన్‌ ప్రాంతాల సేవింగ్స్‌ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్‌ బ్యాలెన్స్‌ 3వేల రూపాయలు. అదేవిధంగా సెమీఅర్బన్‌, రూరల్‌ ప్రాంతాల నెలవారీ ఛార్జీలను కూడా 40 రూపాయల(జీఎస్టీ కలుపుకుని) నుంచి 10 రూపాయల(జీఎస్టీ కలుపుకుని)కు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఛార్జీల తగ్గింపుతో పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా రెగ్యులర్‌ సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌ను బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌గా మార్చుకోవడానికి సదుపాయం కల్పిస్తున్నట్టు బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది.

దీంతో కస్టమర్లు మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీల నుంచి పెద్ద ఉపశమనం పొందినట్లయింది. కాగా బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు ఈ మినిమమ్‌ బ్యాలెన్స్‌లను ఛార్జీలను విధించడం లేదు. తమ కస్టమర్ల సెంటిమెంట్లు, ఫీడ్‌బ్యాక్‌ల అనంతరం ఛార్జీలను భారీగా తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఎండీ పీకే గుప్తా తెలిపారు. కస్టమర్ల ప్రయోజనాలకే బ్యాంకు తొలుత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు…

  •  
  •  
  •  
  •  

Comments