గూగుల్‌కు చెంప దెబ్బ‌! 136 కోట్లు అప‌రాధ రుసుం!?

Friday, February 9th, 2018, 11:38:59 PM IST

ఆన్‌లైన్ శోధ‌న‌లో గూగుల్, యాహూ, బ్లింగ్ స‌హా ప‌లు సెర్చ్ ఇంజిన్‌లు అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన‌విగా ప్రూవైంది. అయితే ఈ శోధ‌న‌లో గూగుల్ ఇత‌రుల నుంచి పోటీని త‌ట్టుకునేందుకు .. మ్యానిప్యులేట్ చేస్తోందంటూ ఫిర్యాదు అంద‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. ముఖ్యంగా గూగుల్ ఇండియా అంతా మ్యానిప్యులేష‌న్‌పై న‌డుస్తోంద‌న్న ప్ర‌చారం చాలా కాలంగా ఉంది. డ‌బ్బు చెల్లించి గూగుల్ ప్ర‌తినిధుల‌తో మ్యానిప్యులేట్ చేయ‌డం అన్న త‌ప్పుడు ప‌ని నిరంత‌రాయంగా సాగుతోంద‌ని అధ్య‌య‌నంలో తేలింది. పోటీని త‌ట్టుకునేందుకు గూగుల్ ఇలాంటి త‌ప్పుడు ప‌నులు చేస్తోందంటూ 2012లోనే కాంపిటీట‌ర్ సెర్చ్ ఇంజిన్ కంపెనీలు ఫిర్యాదు చేయ‌డంతో అప్పట్లోనే కేసు న‌మోదైంది.

తాజాగా గూగుల్‌పై కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చ‌ర్య తీసుకుంది. నేరం రుజువైనందున‌ గూగుల్ చేసిన త‌ప్పుడు ప‌నికి ఏకంగా 136 కోట్ల మేర అప‌రాధ రుసుం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఇన్‌ఫ్రింజ్‌మెంట్ యాంటీ ట్ర‌స్ట్ కండ‌క్ట్ , అన్ ఫెయిర్ బిజినెస్ పేరుతో సీసీఐ అథారిటీ సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంది. ఇది అంత పెద్ద సంస్థ‌కు చెంప పెట్టులాంటిదే. న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌డం.. మోసం చేయ‌డం వంటి నీతిమాలిన ప‌నులు చేయ‌డం ద్వారా పోటీలో నిల‌వ‌డం చేత‌కానిత‌నం అంటూ ఇత‌రులు ప్ర‌చారం చేసుకునేందుకు ఇప్పుడు ఆస్కారం ఇచ్చిన‌ట్ట‌య్యింది. ఇది ఇత‌ర సెర్చ్ ఇంజిన్ల మార్కెట్ పెంచుకునేందుకు క‌లిసొచ్చేదే.