విశాఖలో గూగుల్?

Thursday, September 25th, 2014, 11:04:21 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖను ఐటి హబ్ గా మారుస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చంద్రబాబు శరవేగంగా చేస్తున్నారు. ఇక ఇప్పటికే విప్రో, టెక్ మహేంద్రా లాంటి పెద్ద కంపెనీలు విశాఖలో తమ సంస్థల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే పెద్ద కంపెనీలు వస్తే తప్ప విశాఖ ఐటి హబ్ గా వృద్ధి చెందదని ఆలోచించిన ఏపీ సర్కారు బడా కంపెనీలకు మంచి సదుపాయాలనే సమకుర్చుతోంది.

ఈ నేపధ్యంగా సెప్టెంబర్ 29న విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటి కంపెనీలతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశానికి ప్రపంచాన్ని శాసిస్తున్న ఐటి దిగ్గజం గూగుల్ ప్రతినిధులు కూడా వస్తున్నట్లు సమాచారం. అలాగే అదే రోజున విశాఖలో గూగుల్ ఏర్పాటు చెయ్యబోయే కార్యాలయంపై కంపెనీకి ప్రభుత్వానికి మధ్య మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే త్వరలో విశాఖ ఐటి హబ్ గా మారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.