గూగుల్ సూపర్ అంతే..భారీ కేసు నుంచి యువకుడిని సేవ్ చేసింది..!

Sunday, October 1st, 2017, 12:25:17 AM IST

భారీ కేసుని చిందించాలంటే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్న ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టారు. అలాంటి చిన్న ఆధారాలతోనే పెద్ద పెద్ద కేసుల్లో నిజాలు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయ్. అలాంటి అరుదైన ఘటన తాజగా ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లో గతేడాది 11 ఏళ్ల బాలుడి హత్య జరిగింది. ఈ కేసులో పోలీస్ ల వైఖరే అనుమానంగా ఉండడంతో న్యాయమూర్తి విచారణ కొరకు వేరే కమిటీని నియమించారు. దీనితో అసలు నిజం బయట పడింది. మొదట ఈ కేసులో వాయుసేన అధికారి కుమారుడు జై ప్రతాప్ సింగ్ ని పోలీస్ లు అనుమానించారు. అతడే దోషిగా కోర్టు ముందు నిలబెట్టారు. కానీ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సాయంతో జై ప్రతాప్ నిర్దోషిగా కేసు నుంచి బయట పడ్డాడు.

2016 ఆగష్టు 20 సాయంత్రం 6:30 గంటలకు రెహమాన్ అనే 11 ఏళ్ల పిల్లవాడు అదృశ్యమయ్యాడు. రెండు గంటల తరువాత అతడి మృత దేహం లభ్యం అయింది. గుర్తు తెలియని వారు బాలుడి గొంతు కోసి హత్య చేశారు. ఈ కేసులో జై ప్రతాప్ ని పోలీస్ లు నిందితులుగా పేర్కొన్నారు. కానీ జై తరుపున న్యాయ వాది జై నిర్దోషి అనడానికి బలమైన ఆధారాల్ని సమర్పించారు. హత్య జరిగిన సమయం లో జై ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్లు ఐపి అడ్రెస్ ని చూపించారు. దీనిపై పోలీస్ లు గూగుల్ సంస్థని విచారం చేయగా.. జై ఆరోజు సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకు యానిమేషన్ కు సంభందించిన వివరాల కొరకు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దీనితో జై నిర్దోషిగా తేలాడు. పోలీస్ అధికారి కుట్ర పూర్వకంగా జైని ఇరికించినట్లు తేలింది. గతంలో ఓ కేసుకు సంబంధించి పోలీస్ అధికారి జై తండ్రిని బెదిరించాడు. డబ్బులు ఇస్తే ఆ కేసుని క్లోజ్ చేస్తానని తెలపడంతో జై తండ్రి నిరాకరించాడు. దానిని మనసులో పెట్టుకుని జై ని ఈ కేసులో ఇరికించినట్లు తేలింది.

Comments