ట్రైలర్ : గోపి చంద్ పంతం గట్టిగానే ఉందే!

Tuesday, June 5th, 2018, 12:07:38 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ ముందున్నాడనే చెప్పాలి. వరుసగా డిజాస్టర్స్ రావడంతో ఈ యాక్షన్ హీరో సినిమాలకు ఇబ్బందులు గట్టిగానే ఎదురవుతున్నాయి. చివరగా గౌతమ్ నంద తో హిట్ అందుకుంటాడని అనుకున్నప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పంతం సినిమాతో రాబోతున్నాడు. చక్రవర్తి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన పంతం సినిమా టీజర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. చూస్తుంటే గోపి నిజంగానే ఎదో కాజ్ ను గట్టిగా ప్రజెంట్ చేసేటట్లు ఉన్నాడని చెప్పవచ్చు. అభిమానులు కోరుకునే యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో చాలానే ఉన్నాయట. దర్శకుడిని నమ్మి తీసిన ఈ సినిమా గోపీచంద్ కెరీర్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments