రివ్యూ రాజా తీన్‌మార్ : పంతం – ట్రీట్మెంట్ పాతదే కానీ.. మెసేజ్ మంచిది

Thursday, July 5th, 2018, 03:17:10 PM IST

తెరపై కనిపించిన వారు : గోపిచంద్, మెహ్రీన్

కెప్టెన్ ఆఫ్ ‘పంతం’ : కె.చక్రవర్తి

మూల కథ :
రాజకీయ నాయకులంతా ఒక సిండికేట్ గా మారి హోమ్ మినిస్టర్ నాయక్ (సంపత్) అండతో ప్రజల డబ్బుని దారి మళ్లించి తమ ఖాతాల్లో వేసుకుంటుంటారు. ఆ డబ్బు మొత్తాన్ని విక్రాంత్ సురాన (గోపిచంద్) దొంగిలిస్తాడు.

దాంతో విక్రాంత్ ను ఎలాగైనా పట్టుకోవాలని నాయక్ ప్రయత్నిస్తుంటాడు. అసలు విక్రాంత్ ఎవరు, అతను కేవలం హోమ్ మినిస్టర్ నే ఎందుకు టార్గెట్ చేశాడు, అతన్నుండి కొట్టేసిన ఆ డబ్బుని ఏం చేశాడు, అసలు హోమ్ మిస్టర్ కాజేసిన డబ్బు ఎవరిది అనేదే తెరపై నడిచే సినిమా.

విజిల్ పోడు :
–> మంచి బలమైన సామాజిక అంశంతో కూడిన సినిమా ప్లాట్ బాగుండి కొంత ఆలోచింపజేసే విధంగా ఉంది. కనుక మొదటి విజిల్ దానికే వేయాలి.

–> హీరో గోపిచంద్ నటన పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఫైట్స్ బాగున్నాయి. అందుకే రెండో విజిల్ ఆయనకు వేయాలి.

–> అక్కడక్కడా నవ్వించిన్ హాస్యం, క్లైమాక్స్ కోర్ట్ సీన్స్ ఆకట్టుకున్నాయి. వీటన్నిటికీ కలిపి మూడో విజిల్ వేయాలి.

ఢమ్మాల్ డుమ్మీల్ :

–> ప్లాట్ బాగున్నా దానికి దర్శకుడు చక్రవర్తి రాసుకున్న ట్రీట్మెంట్ రొటీన్ గా, పాతగా ఉండటంతో సినినిమాలో కొత్తదనం ఏమీ కనబడలేదు.

–> ఇక బోర్ కొట్టించిన కథనం చూస్తే సినిమా కొన్నేళ్లు ముందు రావాల్సిన సినిమాలా అనిపించింది.

–> హీరో హీరోయిన్ల నడుమ రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకోలేకపోయింది. అలాగే కీలకమైన ద్వితీయార్థం చాలా నాటకీయంగా ఉంది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
సినిమాలో వింతగా తోచిన అంశాలేవీ లేవు.

సినిమా చూసిన ఇద్దరి స్నేహితుల మధ్యన సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఎ : సినిమాలోని మెసేజ్ బాగానే ఉంది కదా.
మిస్టర్ బి : అది ఓకే.. సినిమానే పాతగా ఉంది.
మిస్టర్ ఎ : అవును.. డైరెక్టర్ ఔట్ డేటెడ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments