అసభ్యంగా ప్రవర్తించాడంటూ అల్లు శిరీష్ పై కేసు

Sunday, June 9th, 2013, 12:00:26 PM IST

ప్రముక నిర్మాత అల్లు అర్జున్ తనయుడు అల్లు శిరీష్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దస్ పల్లా హోటల్ లో శనివారం రాత్రి జరిగిన పార్టీలో తనపై చేయిచేసుకున్నాడంటూ, తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ యువతి జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. భాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శిరీష్ పై ఐపిసి సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.

ఈ విషయం పై పూర్తి విచారణ జరిపిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బెదిరింపు కాల్స్ రావడంతో ఆ మహిళ గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడంటూ తన ఫిర్యాదులో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.