ఇక రిటైర్ అవుతా అంటున్న క్రికెటర్..!

Tuesday, December 4th, 2018, 10:30:16 PM IST

టీమిండియా సీనియర్ ఆటగాడు గౌతమ్ గంబీర్ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అవనున్నట్టు ప్రకటించాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి తెలిపాడు. గత పదిహేనేళ్లుగా క్రికెట్ లో దేశానికి సేవలందించా అని అన్నాడు. ఇక వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కొంతకాలంగా తన ప్రదర్శనని చాలా మంది అవహేళన చేశారని, తాను ఔటై డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్నప్పుడల్లా విన్న కామెంట్లు తన మనసును కలిచివేశాయని ఆ వీడియోలో బాధపడ్డాడు. పరోక్షంగా ఆ అవమానాలు భరించలేకే తన రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్ లో సాధించిన ఘనతలను గంభీర్ ఈ వీడియో ద్వారా గుర్తుచేసుకున్నాడు. ఇంతకాలం తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన గంభీర్, కోల్ కతా అభిమానులకు ప్రత్యేకంగా తన కృతఙ్ఞతలు తెలిపాడు.

ఈ గురువారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల లో ఢిల్లీ – ఆంధ్ర జట్ల మధ్య జరిగే మ్యాచ్ గంభీర్ కు చివరి మ్యాచ్ కానుంది. 2003 ఏప్రిల్ 14న టీమ్ ఇండియాలో గంభీర్ ప్రవేశించాడు. గంభీర్ తన పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్ లో 58 టెస్టులు,147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు.

  • 1
  •  
  •  
  •  

Comments