టీటీడీ పై ప్రభుత్వ జోక్యం సరైనది కాదు : బిజెపి నేత

Thursday, May 24th, 2018, 03:20:09 PM IST

టిటిడి ఆధీనంలోని నగలు మాయమవడం వెనుక పలురకాల ఊహాగానాలు వెలువడుతుండడంతో కేంద్ర బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఆయన మాట్లాడుతూ టిటిడి పై ప్రభుత్వ జోక్యం కుదరదని, ఆ విషయాన్ని టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు తెలుసుకోవాలని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ఈ కేసులో మూడు ప్రధాన అంశాల విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిజానికి ఆభరణాల మాయం విషయంపై టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి అంత తేలికగా కొట్టిపారేయడం సమంజసం కాదని, ఇది చిన్న విషయం కాదని గుర్తుంచుకోవాలని అన్నారు.

ముఖ్యంగా ఈ కేసు ను సిబిఐ కు అప్పగించాలనేది తమ మొదటి డిమాండ్ అని చెప్పారు. అలానే టిటిడి ప్రభుత్వ నియంత్రణలో నుండి బయటకు వచ్చి సాధువుల కమిటీ ఆధ్వర్యంలో నడపాలి అనేది రెండవ డిమాండ్ గా చెప్పారు. వయస్సు నిబంధనల ఆధారంగా రమణ దీక్షితులను పదవినుండి తొలగించడాన్ని ఆగమ శాస్త్ర విరుద్ధమని, ఆయన్ని తొలగించే అధికారం అసలు టీటీడీ బోర్డుకు లేదని, కావున ఆయన తొలగింపు నిర్ణయంపై స్టే ఇవ్వాలి అనేది తమ మూడవ నిర్ణయంగా చెప్పుకొచ్చారు.

అయితే తన తొలగింపు విషయమై, అలాగే టిటిడి విషయమై సుప్రీమ్ కోర్ట్ ని ఆశ్రయిస్తాం అన్న తర్వాత రమణ దీక్షితులు ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు రమణ దీక్షితుల్ని పదవి చ్యుతుడిని చయయడంతో ప్రభుత్వం పై ఆగ్రహించిన బ్రాహ్మణా సంఘాల వారు విజయవాడ బెంజ్ సర్కిల్ లో నిరసన చేపట్టారు. కాగా ప్రస్తుతం ఈ ఉదంతం పెద్ద దుమారాన్నే రేపుతూ, రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments