హాలిడేస్ లో కార్పొరేట్ స్పెషల్ క్లాసులు.. చర్యలకు సిద్దమైన ప్రభుత్వం!

Thursday, May 3rd, 2018, 09:14:46 PM IST

స్కూల్ మొదలవ్వగానే దాదాపు 10 నెలల వరకు విద్యార్థులు పుస్తకాలతో పోరాడాల్సిందే. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులపై చదువు భారం చాలా పెరుగుతోంది. పాఠశాల దశ అయిపోగానే విద్యార్థులను ఇంటర్ క్లాస్ లకు పంపి అడ్వాన్స్ క్లాసెస్ ని స్టార్ట్ చేయిస్తున్నారు. తల్లి దండ్రులను మభ్య పెట్టి కార్పొరేట్ కలశాలాలూ ఈ విధంగా బిజినెస్ చేస్తున్నాయి. అయితే ఎండాకాలం సెలవుల్లో ప్రభుత్వం, విద్యాశాక బోర్డులు తరగతులు నిర్వహించవద్దని ఇంతకుముందే తెలియజేసింది. కానీ కార్పొరేట్ కలశాలలు అవేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు యథేచ్ఛగా ఇంటర్ తరగతులను ప్రారంబించాయి.

దీంతో ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు పలు కళాశాలలపై తనికీలు నిర్వహించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తరగతులు నిర్వహిస్తున్న కాలేజ్ లోపలికి వెళ్లి విద్యార్థులను బయటకు పంపి తాళాలు వేశారు. వారికి నోటీసులు కూడా అందించినట్లు ఓ నివేదిక ద్వారా ఇంటర్మీడియట్ విద్యామండలి వారు తెలియజేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం తరగతులను పలు కార్పొరేట్ కాలేజ్ లకు ఈ విధంగా వ్యవహరించడం కొత్తేమి కాదు. తల్లిదండ్రులను మాటలతో మభ్యపెట్టి విద్యార్థులను కాలేజ్ లకు రప్పిస్తున్నారు. ఇక 10వ తరగతి రిజల్ట్స్ రాగానే స్కూళ్లకు వెళ్లి పాఠశాల యాజమాన్యంతో తమ కళాశాలలో విద్యార్థులను జాయిన్ చేయిస్తే పర్సెంటేజ్ ఇస్తామని కార్పొరేట్ విద్యా సంస్థలు బిజినెస్ చేయడం అలవాటుగా మారింది. ఇక ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం అలాంటి కాలేజ్ లపై కఠినచర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments