గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదు : సిద్దరామయ్య

Friday, May 18th, 2018, 03:55:40 PM IST

కన్నడ రాజకీయాలు ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఉత్కంఠగా మారాయి అక్కడ అత్యధిక సీట్లు సాధించిన బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు యెడ్యూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం రేపటిలోగా తమ బలనిరూపణ చేసుకోవాలని సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పను ఆహ్వానిస్తున్నట్లు సిద్దరామాయ్యా నేడు మీడియా తో అన్నారు.

గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడంలేదని, అయినా యెడ్యూరప్ప బలనిరూపణకు 7 రోజులు మాత్రమే గడువుకోరితే గవర్నర్ 15 రోజులు ఎలా ఇస్తారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఆయన ఏకపక్షంగా బిజెపికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడమేమిటని మండిపడ్డారు. రాజ్యాంగం అంటే చట్ట ప్రకారం రాసుకున్నది, అంతే తప్ప అది మోడీ, అమితాషాల సొత్తు కాదని, దీని గవర్నర్ కాస్త తెలుసుకోవాలని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ బిజెపి పార్టీ కర్ణాటకలో విలువలను పాతరేసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిందని అన్నారు.

అసలు ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన బలం లేనప్పటికి గవర్నర్ వారిని ఎలా ఆహ్వానిస్తారని, అయినా బలనిరూపణకు ఎక్కడైనా 7 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది, మరి అలాంటిది 15 రోజులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇదివరకు బీజేపీ గోవా, మేఘాలయ,మణిపూర్ మూడురాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అనుసరిస్తోందని చెప్పుకొచ్చారు. మోడీ కి పదవుల పిచ్చి తప్ప ప్రజాపాలనపై బాధ్యత కొరవడిందని అందుకే కేంద్రంలో అధికారం వున్నాం కనుక రాష్ట్రాలపై కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది ఒకరకంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేసినట్లే అవుతుందని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments