ఈ సారి భారీగా బతుకమ్మ పండగ

Saturday, September 13th, 2014, 03:42:30 PM IST


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మ వేడుకలను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలో పలు రాష్ట్రాలతోపాటు.. అంతర్జాతీయ మహిళా ప్రముఖులను సైతం ఈ సందర్భంగా ఆహ్వానించి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నలుదిక్కులా చాటాలని సర్కార్ భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధికారికంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. మైసూర్ లో నిర్వహించే దసరా ఉత్సవాలను మరిపించే విధంగా… ఈ వేడుకలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం కేసీఆర్… ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత, పలువురు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చిహ్నంగా… యావత్తు దేశం దృష్టి ని ఆకర్షించే విధంగా పండుగ నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. 10 వేల బతుకమ్మలు ఎల్ బి స్టేడియంలో ప్రభుత్వ సహకారంతో ఏర్పాట్లు చేయనాని సర్కార్ నిర్ణయించింది. 25 వేల మంది మహిళలు బతుకమ్మలతో తరిలివెళ్తుంటే… ఆకాశంలో హరివిల్లు నేలకు దిగిందా… అనే విధంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. బతుకమ్మ పండుగ జరిగే తొమ్మది రోజుల పాటు నగరమతా శోభయమానంగా తీర్చితిద్దనున్నారు.

బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం 10 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతి జిల్లాకు 10 లక్షల చొప్పున విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఈ పండుగకు దేశంలోని మహిళా సీఎంలు జయలలిత, వసుంధరా రాజే, ఆనంద్ బెన్, మమతా బెనర్టీలతో పాటు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, మహిళా గవర్నర్ లు, కిరణ్ బేడీ లాంటి ప్రముఖులను ఆహ్వనించాలని సర్కార్ భావిస్తోంది. వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల భార్యలు కూడా బతుకమ్మ పండుగలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ సూచించారు.

వచ్చే ఏడాది నుంచి శాశ్వత ప్రాతిపదికన నెక్లెస్ రోడ్ లో బతుకమ్మ పండుగ ఆడేందుకు పర్మినెంట్ వేదికను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత.. ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో… అటు తెలంగాణ జాగృతి.. మరో వైపు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు..