చేపమందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్

Friday, June 7th, 2013, 04:58:26 PM IST

చేపమందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. మృగశిర కార్తె ఆరంభంలో ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ‘చేప ప్రసాదం’ పంపిణీ చేసే బత్తిన సోదరులకు హైకోర్టు ఊరటనిచ్చింది. చేప ప్రసాదం పంపిణీ ఖర్చులు నిర్వాహకులే భరించాలని, అసలా మందుకు శాస్త్రీయతే లేదని రెండ్రోజుల క్రితం లోకాయుక్త తీర్పునివ్వగా.. తాజాగా రాష్ట్ర హైకోర్టు ఆ తీర్పును తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

లోకాయుక్త ఆదేశాలను బత్తిన హరినాథ్‌ గౌడ్ హైకోర్టులో సవాల్ చేశారు. చివరికి చేపప్రసాదం పంపిణీకి ప్రభుత్వం యథావిధిగా ఏర్పాట్లు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. దీంతో జూన్ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఏ ఆటంకాలు లేకుండా జరుగనుంది.