వైరల్ వీడియో : సింహంతో యువకుల ఆటలు

Thursday, June 7th, 2018, 11:36:49 PM IST

సాధారణంగా సింహం కనిపిస్తే ఎవరైనా సరే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొంత మంది మాత్రం ఎవరు ఊహించని విధంగా మృగరాజుతో ఆటలాడటం అందరిని షాక్ కి గురి చేసింది. గుజరాత్ లో జరిగిన ఓ ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు వివరాల్లోకి వెళితే.. రాజకోట్ గిర్‌ పార్క్‌ సమీపంలో కొంత మంది యువకులు పార్టీ చేసుకున్నారు.

అయితే అటు నుంచి వచ్చిన ఓ ఆడ సింహంను చూసి ఆ యువకులు దాన్ని ఆటపట్టించడం మొదలు పెట్టారు. సింహం ముందు ఒక కోడిని ఉంచి దాని ఓపికకు పరీక్షా పెట్టారు. వారితో పాటు ఒక మహిళా కూడా ఉంది. ఇలా చేయడం తనకు మామూలే అని ఓ వ్యక్తి అంటుండడం గమనార్హం. చివరికి కోడిని ఇవ్వగానే సింహం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విధంగా చాలా మంది అడవి జతువులతో వెక్కిలి చేష్టలు చేస్తున్నట్లు పోలీసులు కనుగొని వారిని అరెస్ట్ చేయగా వారి మొబైల్ ఈ వీడియో దొరికింది.

  •  
  •  
  •  
  •  

Comments