చచ్చాడనుకొని పోస్టుమార్టం చేయబోతుంటే.. బ్రతికేశాడు!

Saturday, June 9th, 2018, 11:18:05 AM IST

ఇటీవల కాలంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల కొంత మంది ప్రాణాలు పోతుండడం ఎక్కువగా జరుగుతోంది. ప్రాణాలు కాపాడిల్సిన వారు వృత్తిపై శ్రద్ధ పెట్టకుండా చేస్తున్న పనులు తీవ్ర భయానికి గురి చేస్తున్నాయి. రీసెంట్ గా నాగ్ పుర్ లో కొందరు డాక్టర్లు చేసిన పనికి దేశమంతటా షాక్ కి గురైంది. చచ్చిపోయాడని ఓ యువకుడిని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. తీరా అతను చనిపోలేదని తెలియడంతో మళ్లీ కొత్త నాటకానికి తెరలేపారు.

అసలు వివరాల్లోకి వెళితే.. హిమాన్షు భరద్వాజ్ అనే వ్యక్తి రీసెంట్ గా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కారులో వెళుతుండగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టాట్టడంతో అతని తలకు బాగా గాయాలయ్యాయి. తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా వైద్యం అందించారు. అయితే వైద్యులు అతడు మరణించాడు అనుకోని పోస్ట్ మార్టం కోసం మార్చురీ రూమ్ కు తరలించారు. ఇక తీరా పోస్ట్ మార్టం స్టార్ చేయడానికి సిద్దమైన సిబ్బంది అతని చేతిపై కత్తితో కోయగా వెంటనే హిమాన్షు అరిచేశాడు.

అతను చనిపోలేదని తెలుసుకున్న వైద్యులు వెంటనే సాధారణ వర్డ్ కి తరలించి యధావిధిగా వైద్యం అందించారు. విషయం బయటకి రావడంతో అలాంటిదేమి లేదని అబద్దాలు చెప్పారు. హిమాన్షు కుటుంబ సభ్యులు హాస్పటల్ చేసిన పనికి నిరసనలు తెలిపారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంపై ఇంకా ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.