దుబాయ్ లో తెలుగోడి దుర్భర జీవితం!

Monday, September 10th, 2018, 03:37:41 PM IST

కన్నవారిని సొంత ఉరిని విడిచి విదేశాలకు వెళుతున్న ఎంతో మంది జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. ఇక డబ్బు సంపాదించాలని గల్ఫ్ దేశాలకు వెళుతున్న యువకులు అయితే అక్కడే చిక్కుకొని పోతున్నారు. స్వదేశానికి రాలేక అక్కడ ఉండలేక నడిమధ్యలో కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల బయటకు వచ్చిన ఒక తెలుగు యువకుడి ఘటన కూడా ఎంతో ఆలోచింపజేస్తోంది.

గల్ఫ్ ఏజెంట్ మాటలను నమ్మి అప్పుచేసి మరి డబ్బుచ్చి దుబాయ్ కు వెళ్లిన ఆ యువకుడు అక్కడ అడుక్కొని ప్లేట్లు కడిగి జీవితాన్ని గడిపాడు. అసలు వివరాల్లోకి వెళితే.. తీర్పుగోదావరి జిల్లాకు చెందిన హేమ సుందరరావు కుటుంబం బ్రతుకుదెరువు కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వచ్చారు. అతని కొడుకు నాగేంద్ర మెకానిక్ పనితో తండ్రికి సహాయంగా ఉండగా అక్కడే అతనికి భీఖాన్‌ అనే గల్ఫ్‌ ఏజెంట్‌ పరిచయయ్యాడు. దుబాయ్ లో తన మరదలు ఉంటుందని అక్కడికి వెళ్లి ఒక ఆఫీస్ లో మంచి పని దొరుకుతుంది. డబ్బులు బాగా సంపాదించవచ్చని ఆ కుటుంబాన్ని నమ్మించి లక్షన్నర గుంజాడు. ఈ ఏడాది మే నెల 29న విజిట్ వీసాతో దుబాయ్ విమానం ఎక్కించాడు.

అయితే నాగేంద్ర ఉహించనట్టుగా అక్కడ పరిస్థితి కనిపించలేదు. ఏజెంట్ మరదలు అతన్ని మొదట ఒక గ్యారేజ్ లో హెల్పర్ ఉద్యోగం ఇప్పించింది. అక్కడ పాకిస్తాన్ యువకుల వేధింపులు భరించలేకపోయాడు. ఆ తరువాత ఒక హోటల్ లో ప్లేట్లు కడిగే ఉద్యోగం ఇప్పించింది. ఇక వీసా గడువు ముగిసే సమయానికి ఏజెంట్ అతన్ని పట్టించుకోలేదు. దీంతో పోలీసుల కంట పడకుండా బిక్షమెత్తుకొని వీసా రెన్యూవల్ చేయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత కొడుకు పరిస్థితి గురించి తెలుసుకున్న హేమ సుందరరావు ఏజెంట్ దగ్గరకు వెళ్లి కొడుకుని స్వదేశానికి వచ్చేలా చేయాలనీ అడగడంతో అతన్ని ఏజెంట్ కొట్టించాడు. చేసేదేమి లేక మరికొంత అప్పు చేసి కొడుకుని స్వదేశానికి వచ్చేలా చేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. అనంతరం ఏజెంట్ పై పోలీసులకు పిర్యాదు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments