రాణి రుద్రమదేవిపై బాబు స్పందనేమిటో

Friday, October 10th, 2014, 12:41:10 AM IST


రాణి రుద్రమదేవి కధను సినిమాగా తెరకెక్కిస్తున్న ప్రముఖ దర్శకుడు గుణశేఖర్, టాక్స్ మినహాయింపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన విషయం తెలిసినదే. అయితే, గుణశేఖర్ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. తెలంగాణ సంస్కృతీకీ, తెలంగాణ చరిత్రకు కెసిఆర్ పెద్ద పీఠ వేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గుణశేఖర్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా కలిసినట్టు తెలుస్తున్నది. సినిమాలకు వాణిజ్యపరింగా ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉండటంతో.. ఈ సినిమాకు అక్కడ కూడా టాక్స్ మినహాయింపు ఇవ్వాలని బాబును ఆయన కోరినట్టు తెలుస్తున్నది. మరి బాబు ఏవిధంగా స్పందిస్తారో.. చూడాలి మరి.