జగన్ వైఖిరి పట్ల కిరోసిన్ పోసుకొని నిరసన వ్యక్తం.!

Monday, October 1st, 2018, 05:58:30 PM IST

వైసీపీ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఏ ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆయనకే తెలియాలి.గత కొంత కాలంగా ఆయన పార్టీలో విపరీతంగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి.వైసీపీలో పార్టీ టిక్కెట్ల విషయంలో తాము అన్యాయం అయ్యాం అని కొంత మంది నేతలు వాపోతున్నారు,ఒకరికి కాదని వేరే వాళ్లకి టిక్కెట్టు కేటాయిస్తున్నారని ఒకరు ఆరోపిస్తున్నారు,జగన్ పార్టీలో 50కోట్లు ఖర్చు పెట్టగలిగే సత్తా ఉంటేనే ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తామంటున్నారని చాలా మంది తెలిపారు.

ఈ రోజు కూడా ఇలాంటి సంఘటనే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది,అక్కడి పశ్చిమ నియోజక వర్గంకి చెందిన అప్పిరెడ్డిని కార్య నిర్వాహక పదవి నుంచి ఆ భాద్యతను ఈ మధ్యనే పార్టీలో చేరినటువంటి యేసు రత్నం అనే వ్యక్తికి ఇవ్వడం పట్ల అక్కడి అప్పి రెడ్డి అభిమానులు విద్యార్థి సంఘం వాళ్ళు తీవ్ర అసంతృప్తికి లోనయ్యి ఒంటిపై కిరోసిన్ పోసుకొని వారి నిరసనను తెలియజేస్తున్నారు.అదే సందర్భంలో వారు మాట్లాడుతూ అప్పి రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జగన్ తో కలిసి అండగా ఉన్నారని,అలాంటి వ్యక్తికి ఈ రోజు తీరని అన్యాయం చేశారని,జగన్ ఎప్పుడు మాట్లాడినా విలువలు,విశ్వసనీయత అని మాట్లాడుతారు కానీ ఈ రోజు జగన్ వైఖరి చూస్తే అలాంటివి ఏమి కనిపించడం లేదని తెలిపారు.ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గాని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనట్టయితే వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని,ఒకవేళ పట్టించుకోని పక్షంలో మూకుమ్మడిగా వైసీపీ పార్టీకి రాజీనామాలు చేస్తామని తెలిపారు.