అప్పు ఇచ్చినందుకు గుండె ఆగింది!

Saturday, February 10th, 2018, 05:00:24 PM IST

ప్రపంచంలో అప్పు కంటే ప్రపధకారమైనది మరోటి లేదని చాలా మంది చెబుతుంటారు. తీసుకున్న డబ్బు ఇస్తామో ఇవ్వమో అనే బాధ ఒక వైపు.. అప్పు ఇస్తాడో ఇవ్వడో అనే బాధ మరో వైపు. ఇలా అప్పు పెట్టె తంటాలు అన్ని ఇన్ని కావు. అయితే రీసెంట్ గా అప్పు ఇచ్చిన గుండె ఆగడం అందరిని షాక్ గురి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లాల నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామంలో నివాసముండే నాగేశ్వరరావు అనే రైతు వ్యసాయ కోసం తెలిసిన రిటైర్డ్ ఉద్యోగి సూర్యనారాయణ వద్ద గత కొంత కాలం రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. అయితే అది ఎలా తీర్చాలో తెలియక ఏమి ఆధారం లేకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని హాస్పిటల్ కి తరలించారు. అయితే తన డబ్బు ఇక తిరిగి రావడం కష్టమే అనుకోని సూర్యనారాయణ ఒక్కసారిగా ఆందోళన చెందడంతో గుండెపొటు వచ్చింది. దీంతో ఆ క్షణమే అతను ప్రాణాలను కోల్పోయాడు.