గుంటూరులో దారుణ హత్య.. అందరు చూస్తుండగానే..

Monday, October 30th, 2017, 12:39:07 PM IST


\హత్యలు ఎంత దారుణంగా ఉంటాయో గుంటూరులో రీసెంట్ గా జరిగిన ఒక ఘటనను గురించి తెలుసుకుంటే మనకే అర్ధమవుతోంది. గుంటూరులోని నడి రోడ్డులో నిత్యం రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో అత్యంత దారుణమైన హత్య జరగడంతో అక్కడి ప్రజలు షాక్ కి గురయ్యారు. వివరాల్లోకీ వెళితే.. విద్యానగర్ నాలుగో లైన్ లో నివాసం ఉండే రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39) రాత్రి 8:26 సమయంలో ఓ రెస్టారెంటులో భోజనం చేసి బయటకి వస్తున్నాడు. ఆయనతో పాటు స్థానిక తెలుగు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాకిరి నాగ చైతన్య కూడా ఉన్నారు.

అయితే రోడ్డు మీదకు వచ్చిన వాసుని ఒక ఏపీ 16 ఏఈ 9199 స్కార్పియో కారు ఢీకొట్టింది. ఆ తర్వాత అతను కింద పడటంతో కారులో నుంచి కొంత మంది వ్యక్తులు ముసుగులతో దిగి వాసుపై కత్తులతో దాడి చేశారు. అది చూసిన జనం పరుగులు తీశారు. హత్య చేసిన తర్వాత హంతకులు అదే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ హత్య యొక్క ఘటన మొత్తం సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. పోలీసులు అనుమానితులను గుర్తించి విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. పాత పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments