వీరూ ట్వీట్..ఆమె గుండెని గుచ్చింది..!

Tuesday, February 28th, 2017, 12:59:14 PM IST


కార్గిల్ అమరవీరుడు, కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్ మెహర్ కౌర్ ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తనని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ తన గుండెని బద్దలు చేసిందని వ్యాఖ్యానించింది. మణ్ దీప్ సింగ్ 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో మరణించాడు. ఈ నేపథ్యంలో గుర్ మెహర్ కౌర్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధమే చంపిందని రాసి ఉన్న ప్లకార్డు ని చేతబట్టుకుని ఉన్న ఫోటోని ఇటీవల సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

దీనిపై సెహ్వాగ్ సెటైరికల్ ట్వీట్ చేసాడు.”నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు.. నా బ్యాట్ చేసింది ” అని రాసిఉన్న ప్లకార్డుని చేతబట్టుకుని ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. సెహ్వాగ్ చేసిన ట్వీట్ ని కొందరు సమర్థించగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తనకు సెహ్వాగ్ చాలా కాలంగా తెలుసని, తన గురించి అలాంటి ట్వీట్ ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని గుర్ మెహర్ కౌర్ వ్యాఖ్యానించింది. సెహ్వాగ్ ట్వీట్ తనని ఎంతగానో బాధించిందని తెలిపింది. ఢిల్లీ రాంజాస్ కాలేజీలో బిజెపి కార్యక్తలు మరియు ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని మెహర్ కౌర్ తీవ్రంగా వ్యతిరేకించింది.దీ నికి వ్యతిరేకంగా ఆమె సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు కూడా చేసింది. ఏబీవీపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న తనని రేప్ చేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయని మెహర్ కౌర్ పేర్కొంది.