జగన్ మోహన్ రెడ్డికి జీవీఎల్ చురకలు.. చంద్రబాబుతో పోలిక !

Thursday, June 6th, 2019, 08:05:47 PM IST

ముఖ్యమంత్రిగా ఎన్నికైన దగ్గర్నుండి వైఎస్ జగన్ చెబుతున్న ఒకే ఒక మాట చంద్రబాబు పాలనలో లక్షన్నర కోట్లు అప్పు పెరిగింది అని. బాబు అండ్ కో ఖాజానాను ఖాళీ చేశారని కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలని, ప్రభుత్వ ఖర్చులన్నీ తగ్గించుకుంటామని అయన అన్నారు. అలా అని నాలుగు రోజులు కూడా గడవక ముందే రంజాన్ సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ఒక ఇఫ్టార్ విందు కోసం ఏకంగా 1.1 కోట్లు ఖర్చు చేశారు.

దీని కోసం ప్రభుత్వం మెరుపు వేగంతో నిధులు రిలీజ్ చేసింది. ఈ ఖర్చు చూసిన చాలా మంది నిధులు లేవని ఇంతలా ఎలా ఖర్చు పెడుతున్నారు అంటూ ఆశ్చర్యపడ్డారు. ఇక భాజాపా నేత జీవిఎల్.నరసింహం అయితే ఏపీ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం. బాబు దుబారా ఖర్చులతో దాన్ని ఇంకా దెబ్బతీశారు. లౌకిక దేశంలో మతపరమైన పండుగలకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడం తగదు. కొత్త సిఎం ఇలాంటి పోకడలకు భవిష్యత్తులో దూరంగా ఉంటారని ఆశిస్తున్నా అని జగన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుని ఉద్దేశించి మాట్లాడారు.

ఇవి ఒక రకంగా కొత్త ముఖ్యమంత్రికి చురకలనే అనుకోవాలి. నిజానికి ఆయన మాట్లాడిన మాటల్లో కూడా వాస్తవం లేకపోలేదు. మరి ఈ అంశంపై వైకాపా శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.