చంద్రబాబు పై విరుచుకుపడ్డ జివిఎల్ నరసింహారావు!

Thursday, May 31st, 2018, 03:45:09 AM IST


ఏపీలో కుటిల ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహ రావు అన్నారు. నేడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు వంటి ముఖ్యమంత్రిని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు. విశాఖపట్నం, చెన్నై కారిడార్లో విజయవాడ, విశాఖపట్నంలకు ప్రభుత్వం పారిశ్రామిక వాడల నిర్మాణానికి అనుమతిచ్చింది, దానివల్ల లక్షల్లో పెట్టుబడులు వస్తాయి, తద్వారా అక్కడి యువతకు వేళల్లో ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కానీ ఈ విషయాన్నీ చంద్రబాబు మాత్రం దాచిపెట్టి తమపై విమర్శలు గుప్పించడం సరైనది కాదని అన్నారు.

యూజీసీ లో అవకతవకలు ఉన్నాయని, అలానే కేంద్రం ఇచ్చిన నిధుల్లో దుర్వినియోగం జరిగినట్లు కేంద్ర పరిశీలనలో తేలిందని అన్నారు. అయినా టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు తినకూడదు, మేము తినము, అందరూ నీతి నిజాయితీతో వ్యవహరించాలని మోడీ చెప్పారని అన్నారు. అయినప్పటికీ వీళ్ళు అవినీతికి ఎలా సహకరిస్తారని మండిపడ్డారు. కాగా ఇప్పటికే రాజధానికి కేటాయించిన నిధుల్లో అవినీతి చోటుచేసుకున్నట్లు కాగ్ ఇచ్చిన నివేదిక లో స్పష్టమైందని, అది నిజంకాకపోతే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు రాజధాని విషయంలో పెట్టిన ఖర్చులు ప్రజల ముందు లెక్కలు చెప్పవచ్చును కదా అన్నారు.

ప్రస్తుతం చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చిరాకేస్తోందని, కేవలం వారి పార్టీ నేతలగురించి మాత్రమే అయన సొంత డబ్బా కొడుతున్నారని, మరి ఇప్పటివరకు ఇన్ని చేసిన బిజెపి మేలును ఆయన ఎందుకు గుర్తుంచుకోవట్లేదని ప్రశ్నించారు. ఊసరవెల్లిలా ఆయన రకరకాలుగా పరిస్థితులను బట్టి రంగులు మారుస్తున్నారని అన్నారు. మొన్నటివరకు ప్రత్యేక హోదా అవసరం లేదన్న బాబు మళ్లి ఇప్పుడు యు టర్న్ తీసుకుని ఇతరపార్టీలు హోదా కావాలని అడుగుతుంటే ఆయన కూడా అదే పాట పాడుతున్నారని, ఇదేమైనా సినిమానా రకరకాల రంగులు మార్చి, రకరకాల ట్విస్ట్ లు ఇవ్వడానికి అని ఎద్దేవా చేశారు. కాబట్టి చంద్రబాబు ఇకనైనా రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై నోరు విప్పి వచ్చిన నిధులను ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలని హితవు పలికారు……

  •  
  •  
  •  
  •  

Comments