జివిఎల్ నరసింహారావు వార్డు మెంబెర్ గా అయినా గెలవగలరా?

Tuesday, August 7th, 2018, 09:58:22 AM IST

ఏపీ రాష్ట్ర విభజన హామీలు మరియు ప్రత్యేక హోదా విషయమై ఇప్పటికే బీజేపీ మరియు టీడీపీల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు టీడీపీ నేతలు మాకు కేంద్రం నుండి ఎటువంటి నిధులు అందలేదు, రాష్ట్రానికి మోడీ మాట ఇచ్చి తప్పారని, ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మా నుండి అవసరమైన నిధులు తీసుకుని, ఇప్పుడేమో ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టేందకు అసత్యాలు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయమై నిన్న హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన బీజేపీ జాతీయ కార్యదర్శి జివిఎల్ నరసింహరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, అలానే టీడీపీ నేతలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేవలం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నట్లుగా చంద్రబాబు డప్పులు కొట్టుకుంటున్నారని, వాస్తవానికి కేంద్రం నుండి సకాలంలో అందవలసిన నిధులు అందాయి కాబట్టే అమరావతి సహా అన్ని కూడా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

అయితే ఇప్పటికే పర్సనల్ డిపాజిట్ ఖాతాల్లో టిడిపి నాయకులు గోల్ మాల్ చేసారని జివిఎల్ నిన్న విమర్శించారు. దాదాపు రూ.53,000 కోట్ల మేర టీడీపీ ఆ సొమ్మును దారి మళ్లించి అవినీతి అక్రమానికి పాల్పడిందని, ఈ విషయాన్నీ స్వయంగా కాగ్ వారే బయటపెట్టడం జరిగిందని అన్నారు. అదేమిటి అని ప్రశ్నిస్తున్న మమ్మల్ని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతూ రకరకాలుగా దూషిస్తున్నారని ఆరోపించారు. ఇకనేడు జివిఎల్ ఆరోపణలపై స్పందించిన టీడీపీ నాయకులూ, ఆయన చేస్తున్న ఆరోపణలని కూడా నిరాధారమైనవని, తమ నాయకులూ చంద్రబాబు నాయుడుగారు నీతి, న్యాయానికి కట్టుబడి పాలనసాగిస్తారేతప్ప ఏమాత్రం అవినీతికి తావివ్వరని, అటువంటివి కూడా అయన మెచ్చరని అన్నారు.

తమపై కక్షతోనే జివిఎల్ ఈ విధంగా లేనిపోని నిందలు వేస్తున్నారని అన్నారు. మోసపూరిత రాజకీయాలు, వంచన రాజకీయాలు చేయడం కేవలం బీజేపీ పార్టీకి, మరియు ప్రధాని మోడీకే చెల్లిందని, అటువంటి పరిస్థితి టీడీపీకి ఎప్పటికి రాదని అన్నారు. జివిఎల్ చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని, అయన చెపుతున్నట్లుగా పిడిల్లోని సొమ్ము అంతటికి తమ దగ్గర లెక్కలు ఉన్నాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలను అణగదొక్కడమే బీజేపీ మార్కు రాజకీయమని, అదే వారి అజండా అని టీడీపీ నేతలు విమర్శించారు. అసలు తాను ఏమి మాట్లాడుతున్నారో అర్ధంకాని పరిస్థితుల్లో జివిఎల్ నరసింహారావు వున్నారని, వాస్తవానికి అయన ఒక వార్డ్ మెంబెర్ గా పోటీ చేయడానికి కూడా పనికిరారని, అటువంటి ఆయన మా పార్టీ మీద ఆరోపణలు చేయడమేంటనీ అన్నారు. మీకు మరియు మీ పార్టీకి నిజంగా విలువలు ఉంటే ఏపీ మోడీగారు చేసిన మోసాన్ని ధైర్యంగా బయటపెట్టండి అని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments