నరేంద్ర మోడీకి భయపడే కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారంట.!

Friday, October 5th, 2018, 12:10:38 AM IST

తెలంగాణలోని అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం పట్ల తీవ్ర స్థాయిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శలను ఎదురుకుంటున్నారు అనే చెప్పాలి.అంతే కాకుండా అదే సమయంలో కెసిఆర్ తాను ముందస్తుకు అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో కూడా సరైన కారణం ఇప్పటి వరకు చెప్పలేదనే చెప్పాలి.ఇప్పుడు ఈ విషయం మీదనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీవీఎల్ కెసిఆర్ పై మాట్లాడుతూ అసలు మీరు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి గల కారణం ఏమిటని,ఈ సమయంలో తెరాస కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వేరే పార్టీలకు కూడా వీరి దగ్గర నుంచి అధికారం లాక్కునే స్థాయి కూడా లేదని,మరి అలాంటప్పుడు ఎందుకు సమాధానం చెప్పడానికి భయపడుతున్నారని ప్రశ్నించారు.కెసిఆర్ ముఖ్యంగా మే నెలలో వచ్చే సాధారణ ఎన్నికలలో దెస వ్యాప్తంగా నరేంద్ర మోడీ యొక్క ప్రభంజనంలో కెసిఆర్ నెగ్గుకురాలేరని,అందుకోసమే భయపడి ముందుగా ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు.