హెచ్1బి ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘన…..అమెరికన్ కంపెనీకి ఫైన్!

Wednesday, May 2nd, 2018, 07:01:51 PM IST

హెచ్1బి వీసాల నిబంధనలు అనుసరించి అమెరికా వెళ్లిన భారతీయ ఉద్యోగులకు తగిన రీతిలో వేతనం ఇవ్వనందున అమెరికన్ కోర్ట్ అక్కడి ఒక కంపెనీకి ఫైన్ విధించింది. విషయంలోకి వెళితే అమెరికా లోని క్లౌడ్విక్ టెక్నాలజీస్ ఐఎన్సీ అనే ఒక సాఫ్ట్ వేర్ సంస్థ భారత్ నుండి ఉద్యోగులను హెచ్1బి వీసా ప్రతిపాదికన తీసుకువచ్చింది. భారత్ కు చెందిన మణి చాబ్రా ఈ కంపెనీకి వ్యవస్థాపక సిఈఓ గా వ్యవహరించడం గమనార్హం. బిగ్ డేటా, క్లౌడ్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, బిజినెస్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ తదితర కార్యకలాపాలు చేపట్టే ఆ సదరు కంపెనీ, ఉద్యోగులు జాయిన్ అయ్యేటపుడు మాత్రం 8300 డాలర్లు జీతంగా ఇస్తామని మొదట్లో చెప్పి, తర్వాత ప్రతినెలా కేవలం 800 డాలర్లు మాత్రం జీవితంగా ఉద్యోగులకు ఇస్తోంది.

మొత్తం ఈ కంపెనీలో 12 మంది ఉద్యోగులుండగా అందులో చాలా మాది మన భారతీయులు వున్నారు. కాగా ఈ విషయమై అమెరికన్ కార్మిక వేతన సంస్థ నిర్వహించగా జరిగిన మోసం బయటపడింది. దీనితో అమెరికన్ కోర్ట్ ఆ కంపెనీకి జరిమానాగా 1,73,044 డాలర్లను విధించింది. అయితే అమెరికన్ ఉద్యోగుల కొరత వున్నపుడు ప్రతిభావంతులైన ఇతర దేశస్థులను హెచ్1బి వీసాల ప్రాతిపదికన ఇక్కడికి పిలిపించి తగిన మొత్తంలో జీతం ఇస్తారు. ఐటి కంపెనీలకు ప్రాచుర్యం పొందిన సిలికాన్ వాలీ లోనే ఈ కంపెనీ నెలకొల్పబడి వుంది. సిలికాన్ వాలీ లోని హై టెక్ వెంచర్స్ లో చాలా మంది ఇతర దేశ ఉద్యోగులు ఈ విధంగా హెచ్1బి వీసాలపైన వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వారే…..