భారత్ టీమ్ లో తెలుగోడి అరంగేట్రం!

Friday, September 7th, 2018, 04:30:48 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలుపుకోవడానికి విరాట్ సేన సిద్ధమైంది. గత నాలుగు టెస్టుల్లో రానిస్తారనుకున్న ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇకపోతే అయిదవ టెస్టులో భారీ మార్పులు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ విరాట్ ఇద్దరి స్థానాలను మాత్రమే మార్చేశాడు. ఇక జట్టులో చాలా కాలం తరువాత ఒక తెలుగోడికి అవకాశం దక్కింది.

హార్దిక్ పాండ్యను కాదని హనుమ విహారికి అవకాశం ఇచ్చారు. ఇక మరో ఆటగాడు జడేజా కూడా అశ్విన్ స్థానంలో బరిలోకి దిగాడు. ఇక పృథ్వీ షాకి అవకాశం ఇస్తారని అనుకున్నప్పటికీ మరోసారి రాహుల్ ధావన్ లపై నమ్మకం ఉంచారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక తెలుగోడు హనుమ విహారికి ఇది మొదటి టెస్టు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు విహారికి కోహ్లీ టీమిండియా క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు. గత కొంత కాలంగా మంచి ఫామ్ లో ఉన్న అభిషేక్ నాయర్ విహారికి పోటీ ఇస్తాడని అనుకున్నప్పటికీ చివరికి విహారి జట్టు సభ్యులతో చేరడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments