ముఖ్యమంత్రిగారూ… హ్యాపీ మ్యారేజ్ డే!

Wednesday, September 10th, 2014, 11:53:42 AM IST


ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల పెళ్లిరోజు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివాహం జరిగి నేటికి 32ఏళ్ళు పూర్తయ్యింది. ఇక 1981 సెప్టెంబర్ పదవ తేదీన ఆ సమయంలో సినిమాటోగ్రఫీ, పురాతత్వ శాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబుకు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరికి చెన్నైలోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ఘనంగా వివాహం జరిగింది.

అయితే ఈ వివాహా మహోత్సవానికి ఆప్తులైన వారికి కొంతమందికి మాత్రమే చంద్రబాబు శుభలేఖలు పంపారు. ఆ కొంతమందిలో చిత్తూరు జిల్లా ములకల మండలానికి చెందిన కాలేషా కుటుంబం కూడా ఉంది. కాగా అప్పట్లో చంద్రబాబు పంపిన పెళ్లి శుభలేఖను ఆ కుటుంబం విలువైన జ్ఞ్యాపికగా ఇప్పటికీ దాచుకుంది. చంద్రబాబు వివాహమై 30ఏళ్ళు దాటినప్పటికీ కాలేషా కుటుంబం తమ అభిమాన నాయకుడి శుభలేఖను ఇప్పటికీ కొత్త శుభలేఖలా అపురూపంగా చూసుకుంటోంది.