“నేటి ఏపీ” వీక్షకులందరికి “గురుపూజోత్సవ” దిన శుభాకాంక్షలు..

Wednesday, September 5th, 2018, 12:55:37 PM IST

మన పుట్టుకతోనే మన మొట్ట మొదటి గురువు అమ్మ. అ అనే అక్షరం తో మొదలయ్యి ఎన్నో జీవిత సత్యాలను తెలుసుకుంటాము, ఆ తరవాత మన చేతిని పట్టుకొని ఈ లోకాన్ని చూపించే రెండో గురువు మన నాన్న. ఆ తర్వాత అమ్మ నాన్నల కన్నా ఎక్కువ సమయం గడిపేది మన పాఠశాల లోనే మన తల్లి తండ్రుల తర్వాత చదువు నేర్పించి, ఈ ప్రపంచం లో ఎలా మనుగడ సాధించాలి. ఎదుటి వ్యక్తితో ఎలా నడుచుకోవాలి. సమాజము పట్ల ఎంత నిబద్ధతతో ఉండాలి. అని నేర్పేది ఒక్క గురువు మాత్రమే.

మనము ఇప్పుడు ఎంతో మందిని మన అభిమాన నటుల్ని చూస్తున్నాము అభిమాన నాయకులని చూస్తున్నాము, వారిని మనం ఇంతలా ఆరాధిస్తున్నాము అంటే వారు ఇంత ఎత్తుకి ఎదగడానికి వారు ఇంత అనర్గళంగా మాట్లాడ్డానికి ఏదైనా సమస్య పట్ల అవగాహన రావడానికి కారణమైన కనిపించని ఎంతో మంది గురువులు ఉన్నారన్న విషయం ఎప్పటికి మర్చిపోకూడదు. ఎక్కడి వరకో ఎందుకు ఇప్పుడిలా ఈ సారాంశాన్ని చదువుతున్నాం అంటే దానికి కూడా కారణం మనకి చదువు చెప్పిన గురువులే కారణం.. అందుకని మీ “నేటి ఏపీ” తరపున డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని వీక్షకులు అందరికి “గురుపూజోత్సవ” దిన శుభాకాంక్షలు.

  •  
  •  
  •  
  •  

Comments