స్కర్ట్ వేసుకుందని, మోడల్ కు వేధింపులు

Monday, April 23rd, 2018, 04:50:04 PM IST

ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసాత్మక ఘటనలు జరగడం పరిపాటి అయింది. అయితే ఏకంగా ఇండోర్ లో ఈ సారి ఒక మహిళా మోడల్ బైక్ పై వెళుతుండగా అటుగా వెళుతున్న ఇద్దరు పోకిరీలు ఆమెను వెంబడించి ఆమె ధరించిన స్కర్ట్ ను లాగడానికి ప్రయత్నించి అసభ్య పదజాలంతో దూషించారు. అయితే ఈ ఘటన సమయంలో బండి అదుపు తప్పి ఆమె కింద పడిపోవడంతో, ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడినుండి పలాయనం చిత్తగించారు. కిందపడ్డ ఆమెకు కొంత మేర గాయాలయ్యాయి. అయితే ఆ ఘటన జరుగుతున్న సమయంలో ఆ చుట్టుప్రక్కల వారు ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం తనకు ఎంతో ఆవేదన కలిగించిందని ఆమె అన్నారు. అయినా మహిళలు ఎటువంటి దుస్తులు వేసుకోవాలి అనేది వారి హక్కు అని, స్కర్ట్ వేసుకుంటే ఇలాగే ఏడిపిస్తారా.

మనం మనవికా సమాజంలో బ్రతుకుతున్నామా లేక అడవిలో వున్నామా అని ఆమె ప్రశ్నించారు. ఇంతమంది జనం వుంది కూడా వారిద్దరిని ఏ మాత్రం వారించలేకపోయారు అదే ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతం అయితే ఆ పోకిరీలు మరింత తెగించేవారని ఆమె వాపోయింది. ఇప్పటికైనా పోలీస్ లు ప్రభుత్వం ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల హక్కులను హరించే విధంగా ప్రవర్తించే ఎటువంటివారికైనా కఠిన శిక్షలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేసారు…….

  •  
  •  
  •  
  •  

Comments