మహిళపై లైంగిక దాడి..సాక్షత్తూ కేసీఆర్ ఆఫీస్ లోనే..!

Sunday, February 26th, 2017, 05:27:30 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై జరిగిన లైంగిన దాడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది.ఓ పోలీస్ అధికారి సీఎం క్యాంపు ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని రెండు నెలల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ ఘటన గురించి సీనియర్ అధికారులకు తెలిసినా మౌనంగానే ఉన్నారట.

దీనితో అతని వేధింపులను తాళలేక ఆ మహిళా నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ముఖ్యమంత్రే కలగజేసుకుని డిఎస్పీ హోదా ఉన్న ఆ అధికారిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి బదిలీచేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.ఆ మహిళా మాత్రం ముఖ్యమంత్రికి మినహా మరెవ్వరికీ చెప్పలేదట. ఈ వ్యవహారంపై తనకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని డిజిపి అనురాగ్ శర్మ అంటున్నారు.