ఆ రూమర్స్ నమ్మకండి.. అన్ని అబద్దాలే : హర్భజన్ సింగ్

Monday, September 3rd, 2018, 03:53:43 PM IST

11వ సీజన్ ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లు జట్లు మారడం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ జట్లు తీరిగి లీగ్ లో అడుగుపెట్టడం అందరిని ఆకట్టుకుంది. అయితే వచ్చే సీజన్ కి కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా స్పిన్నర్ హర్భజన్ విషయంలో అయితే మరి ఎక్కువ పుకార్లే వచ్చాయి. 10 ఏళ్ల వరకు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బజ్జి ఈ ఏడాది చెన్నై జట్టుకి ఆడిన సంగతి తెలిసిందే.

అలాగే ధోని నాయకత్వంలో చెన్నై ట్రోపిని అందించడంలో తనవంతు పాత్రను పోషించాడు. ఇకపోతే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 12వ సీజన్ లో బజ్జి జట్టు మారే అవకాశం ఉన్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. ఢిల్లీ జట్టు తరపున ఆడి మెంటర్ గా కూడా వ్యవహరించనున్నాడు అని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆ రూమర్స్ పై హర్భజన్ క్లారిటీ ఇచ్చాడు. తాను చెన్నైను వీడడం లేదని గట్టిగా చెప్పేశాడు. అలాగే ఇలాంటి రూమర్స్ ను ఎవరు నమ్మవద్దని ఒకవేళ జట్టు మారాలనుకుంటే తానే అధికారికంగా చెబుతానని హర్భజన్ సింగ్ తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments